‘అఅఆ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారైయింది !

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఈనెల 10న హైదరాబాద్లో ఘనంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వేడుకకు వేదిక ఫిక్స్ అయ్యింది. ఫిలిం నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6:30 గంటలకు ఈవేడుక ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎవరు గెస్ట్ గా రానున్నారో తెలియాల్సిఉంది.

ఈ చిత్రంలో రవితేజ కు జోడిగా ఇలియానా నటించింది. ఇక ఈ చిత్రం ఫై శ్రీను వైట్ల ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈచిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతానని చాలా నమ్మకంగా వున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం నవంబర్ 16న విడుదలకానుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares