అక్షర హాసన్ ప్రైవేట్ ఫొటోలు లీక్

ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ‘లో’ దుస్తులతో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. దీనిపై అక్షర ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేయడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో బాధించిందని అక్షర పేర్కొంది.

దేశమంతా #MeToo ఉద్యమం సాగుతున్నా.. ఇంకా కొంతమంది తనలాంటి యువతుల ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అక్షర వాపోయింది. ‘‘ఈ మధ్య నా ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలియదు. కానీ, తప్పుడు బుద్ధితోనే ఇదంతా చేశారని అర్థమవుతుంది. తన అభ్యంతరకర ఫొటోలను షేర్ చేసుకుంటూ వాటిని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఈ వేధింపుల్లో భాగస్వాములే’’ అని పేర్కొంది.

‘‘నా ప్రైవేట్ ఫొటోల లీక్‌పై నేను ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశా. సైబర్ సెల్ పోలీసులు ఈ చర్యకు పాల్పడినవారిని కనుగొంటామని తెలిపారు. తప్పకుండా ఆ వ్యక్తుల ఆచూకీ లభిస్తుందనే అనుకుంటున్నా.. అప్పటి వరకు మీరు బతకండి. నన్నూ గౌరవంగా బతకనివ్వండి. ఇప్పటికైనా ఇంటర్నెట్ నన్ను మరింత వేధించదని భావిస్తున్నా. #MeToo’’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను అక్షర అక్క, నటి శృతిహాసన్ కూడా షేర్ చేసుకుంది.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares