అమరావతి: ‘హ్యాపీ నెస్ట్‌’ బుకింగ్ షురూ

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రారంభమయ్యింది. శుక్రవారం ఉదయం సేల్స్ ప్రారంభంకాగానే.. దాదాపు 75వేల మంది సర్వర్‌తో అనుసంధానమయ్యారు. దీని కోసం విజయవాడలోని సీఆర్డీఏ ఆఫీస్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఫ్లాట్ల కొనుగోలు చేసేందుకు జనాలు క్యూ కట్టారు. భారీ స్పందన రావడంతో.. సర్వర్ కాస్త మొరాయించడంతో.. ఆన్‌లైన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. మొత్తం 150 ఫ్లాట్లను శుక్రవారం బుక్ చేశారు. మరో 300 ఫ్లాట్లు ఈ నెల 15న మరోసారి అందుబాటులో ఉంటాయని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

‘హ్యాపీ నెస్ట్‌’పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో అపార్ట్‌మెంట్లు నిర్మించబోతున్నారు. 12 టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 15 ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. చదరపు అడుగు 3వేల492 రూపాయల వ్యయంతో ఈ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుంది. ఈ ప్లాట్లకు సీఆర్డీఏ బుకింగ్ ప్రారంభించింది. ప్లాట్ల బుకింగ్ విషయానికొస్తే.. ప్లాట్ ధరలో ముందుగా 7శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బును నెలవారీ పద్దతిలో కట్టాలి.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares