‘కవచం’ తో రానున్న బెల్లంకొండ హీరో !

యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ‘కవచం’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ , మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకానుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares