‘చిత్రలహరి’ షూటింగ్ స్టార్ట్ కానుంది !

వరుస పరాజయాలతో డీలా పడ్డ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తరువాత తన కొత్త చిత్రం ‘చిత్రలహరి’ లో నటించడానికి సిద్దమవుతున్నాడు. కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈచిత్రం యొక్క షూటింగ్ నవంబర్ 12న ప్రారంభం కానుంది. ఏకంగా 40 రోజుల పాటు జరిగే ఈ మొదటి షెడ్యూల్ లో 60 శాతం షూటింగ్ ను పూర్తి చేయనున్నారని సమాచారం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా వున్నాడు తేజ్. మరోవైపు ఈచిత్రం విజయం సాధించడం కిశోర్ తిరుమలకు కూడా చాలా అవసరం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares