జనసేన గూటికి మాజీ మంత్రి బాలరాజు

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పారు. శుక్రవారం పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపించారు. మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవలందించే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనచరులు, సన్నిహితుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శనివారం బాలరాజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.

రాజీనామా చేసే ముందు బాలరాజు తన అనుచరులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమీపస్తున్న వేళ.. భవిష్యత్ కార్యాచరణపై వారితో కలిసి చర్చించారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా.. పార్టీ మారితే మంచిదా అంటూ అనుచరుల అభిప్రాయాలు బాలరాజు తీసుకున్నారట. కొంతమంది కాంగ్రెస్‌లోనే కొనసాగుదామంటే.. మరికొందరు పార్టీ మారాలని సూచించారట. చివరికి మెజార్టీ నేతల అభిప్రాయం ప్రకారం జనసేనలోకి వెళ్లాలని అభిప్రాయడపడటంతో.. అటువైపే మొగ్గు చూపారట.

మండల స్థాయి నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలరాజు.. అంచలంచెలుగా ఎదిగారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మారిపోయినా.. పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares