నేను సీఎం అవుతా.. ఆమె ప్రధాని: అజిత్ జోగి

త్వరలో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కింగ్ అవుతామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారతామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ అధ్యక్షుడు అజిత్ జోగి జోస్యం చెప్పారు. తాను ఛత్తీస్‌గఢ్ సీఎం అవుతానని, బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రధానమంత్రి అవుతారని అజిత్ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కూటమి అధికారం హస్తగతం చేసుకుంటుందన్నారు.

కెరీర్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌గా సేవలందించిన అజిత్ జోగి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎస్పీ, వామపక్షాలతో కలిసి కూటమిగా బరిలోగి దిగుతున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12 తొలి దఫా, 20న రెండో దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి వస్తాయని, ప్రధానమంత్రి పదవికి మాయావతి అర్హురాలని అభిప్రాయపడ్డారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటములు ఏకమైతే దళిత మహిళ మాయావతి ప్రధానిగా అత్యున్నత బాధ్యతలు స్వీకరిస్తారని అజిత్ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఎన్నికలపై అజిత్ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీయేత, కాంగ్రెసేతర కూటమి 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి పదవికి మాయావతే సరైన అభ్యర్థి అని ఆయన కితాబిచ్చారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, అట్టడుగు వర్గం నుంచి మాయ వచ్చారని పైగా మహిళ కావడం వల్ల పీఎం పదవికి మాయావతే సబబని అజిత్ అన్నారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares