నోట్ల రద్దుతో ఒక పద్ధతి, ప్రయోజనం: జైట్లీ

వంబర్ 8, 2016.. భారతీయులకు ఇది మర్చిపోలేని రోజు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక నిర్ణయం ప్రకటించిన రోజు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెద్దనోట్లు ( రూ. 500, రూ. 1000) రద్దయ్యాయి. ఈ సంచలనం జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. నల్లధాన్ని రూపుమాపడం, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామంటూ ప్రధాని మోదీ నాడు ప్రకటించారు. వివిధ రంగాలపై దీని ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ నోట్ల రద్దు, తదనంతర పరిణామాలను గుర్తు చేసుకుంటూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పెద్దనోట్లను రద్దు చేసి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. నోట్ల రద్దును సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఒక పద్ధతి గల ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని జైట్లీ పేర్కొన్నారు..

నోట్ల రద్దు తర్వాత నుంచి పన్నులు ఎగవేయడం తగ్గిందని జైట్లీ తెలిపారు. దేశాన్ని డిజిటల్‌ లావాదేవీల వైపు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల పన్ను ఆదాయం, పన్ను చెల్లింపులు పెరుగుతాయని వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20 శాతం వరకు పెరిగాయని, ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా వృద్ధి నమోదు చేశాయంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.

‘ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో నోట్ల రద్దు అత్యంత కీలకమైంది. ముందుగా భారత్‌ వెలుపల దాగి ఉన్న నల్లధనాన్ని ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. పన్నుల చెల్లింపుల ద్వారా ఈ డబ్బును దేశంలోకి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలా చెల్లించనివారిపై నల్లధనం చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. విదేశాల్లో భారతీయులకున్న బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు’ అని జైట్లీ పేర్కొన్నారు.

నోట్ల రద్దుపై ఎన్నో విమర్శలు వచ్చాయని, అయితే ప్రభుత్వ లక్ష్యం డబ్బును జప్తు చేసుకోవడం మాత్రం కాదని జైట్లీ వివరించారు. ఓ పద్ధతి గల ఆర్థిక వ్యవస్థను తయారుచేయడమే లక్ష్యంగా ఆ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో బలహీన రంగాలను కూడా సంఘటితం చేశామని చెప్పారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా దేశంలో చాలా మంది బ్యాంకింగ్‌ వ్యవస్థతో
అనుసంధానమయ్యారని వెల్లడించారు.

‘మే, 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం రూ. 3.8 కోట్లుగా ఉంది. మా ప్రభుత్వ హయాంలో మొదటి నాలుగేళ్లలో అది రూ. 6.86 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్ని కూడా గణనీయంగా తగ్గించాం. అదేసమయంలో పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. దేశ పౌరులకు మంచి జీవన విధానాన్ని అందించాం. మెరుగైన మౌలిక వసతులు, ఆదాయాన్ని సమకూర్చాం’ అంటూ జైట్లీ ట్విటర్‌లో పోస్టు చేశారు.

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fnotes%2Farun-jaitley%2Fimpact-of-demonetisation%2F906015826253633%2F&width=500″ width=”500″ height=”456″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true” allow=”encrypted-media”></iframe>

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares