ముదిరిన సంక్షోభం.. శ్రీలంక పార్లమెంట్ రద్దు

శ్రీలంక రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. చివరికి తన మద్దుదారుడికి ప్రధాని పదవి అందించడం వీలుకాదని భావించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన లంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. శుక్రవారం తన పార్టీ నేతలు, మద్దతుదారులపై కీలకభేటీ అనంతరం సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నారు.

తనకు ఆప్తుడు, సన్నిహితుడైన మహీంద రాజపక్సేను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టుందుకు అవసరమైన మెజార్టీ సభ్యుల బలం లేదని తెలుసుకుని పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సిరసేన నిర్ణయం (పార్లమెంట్ రద్దు) అములులోకి రానుంది. దాదాపు రెండేళ్ల సమయానికి ముందే 225 మంది పార్లమెంట్ సభ్యులు తమ పదవిని కోల్పోతున్నారు.

2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఓ మంత్రి తెలిపారు. బలనిరూపణ నేపథ్యంలో సాధారణ మెజార్టీకి తమకు 8మంది సభ్యులు తక్కువయ్యారని యూనైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్ (యూపీఎఫ్ఏ) నేతలు వెల్లడించారు. గత అక్టోబర్ 26న అధ్యక్షుడు సిరిసేన.. ప్రధాని పదవి నుంచి రాణిల్ విక్రమసింఘేను తప్పించిన రోజు నుంచీ లంకలో సంక్షోభం కొనసాగుతోంది.

లంక పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య సైతం అధ్యక్షుడు సిరిసేన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మెజార్టీ ఉన్న నేతనే ప్రజాస్వామ్యంలో అధినేత అవుతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 16 వరకు పార్లమెంట్‌ను రద్దు చేసిన సిరిసేన.. తన మిత్రుడు రాజపక్సేకు ప్రధాని బాధ్యతలు అప్పగించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. తమ కూటమికి మెజార్టీ అసాధ్యమని తెలుసుకున్న వెంటనే పార్లమెంట్‌ను రద్దు చేశారు.

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares