‘వినయ విధేయ రామ’.. మిలియన్ల రికార్డ్స్ వేట

రేయ్.. నువ్ పందెం పరశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్.. రామ్ కొణెదల అంటూ ‘వినయ విధేయ రామ’గా రామ్ చరణ్ బల్ల గుద్దితే యూట్యూబ్ షేక్ అవుతోంది. మెగా స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ్ చరణ్, బోయపాటి కాంబో మూవీ ‘వినయ విధేయ రామ’ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలై మిలియన్ల వ్యూస్ దండయాత్ర మొదలు పెట్టింది. విడుదలైన 30 నిమిషాల వ్యవధిలోనే మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి టాప్ ట్రెండింగ్‌లో హవా కొనసాగిస్తుంది.

‘అన్నా.. వీడిని చంపేయాలా భయపెట్టాలా? అంటే.. భయపెట్టాలంటే పది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట ఏదైనా ఓకే.. డిసైడ్ చేస్కో’ అంటూ రామ్ కొణెదల బేస్ వాయిస్‌తో చెప్తున్న మాస్ డైలాగ్‌కి మెగా అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.

టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి తన మార్క్ చూపించిన దర్శకుడు బోయపాటి.. ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’కి బదులుగా ‘వీర విధేయ రామ’ అని పేరు పెడితే బావుండేమో అనిపించకమానదు. ఫస్ట్ లుక్‌లోనే రామ్ చరణ్‌ని ఊర మాస్ లుక్‌లో చూపించి సినిమాపై అంచనాలు పెంచేసిన బోయపాటి.. టీజర్‌లో సైతం అదే ఫ్లోని కంటిన్యూ చేశాడు. రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్ మధ్య యాక్షన్ అండ్ వార్ సన్నివేశాల్ని శాంపిల్ లుక్‌లో చూపించారు. ఇవి బోయపాటి గత చిత్రాలను గుర్తుచేస్తున్నప్పటికీ.. రామ్ చరణ్ గ్యాంగ్ లీడర్‌‌గా కొత్తగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ గ్యాంగ్‌లో ఒకప్పటి హీరోలు ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్ హీరో)లు కనిపిస్తున్నారు.
పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీలతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. డీ. వీ. వీ. ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌‌లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’ థియేటర్స్‌లో విడుదల కానుంది.

66552608

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares