సీపీఐ అసంతృప్తి.. కూటమికి గుడ్‌బై చెప్పనుందా!

తెలంగాణలో మహా కూటమికి బీటలు వచ్చే అవకాశం ఉందా. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. కాంగ్రెస్ తీరుపై సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా చెప్పిన తర్వాత కూడా తమకు మూడు సీట్లే కేటాయించడంపై మండిపడుతున్నారు. కనీసం ఐదు స్థానాలనైనా కేటాయిస్తారని భావించినట్లు సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి తెలిపారు. గురువారం (నవంబర్ 8) ఢిల్లీలో కుంతియా ప్రకటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

మూడు రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత 74 మంది అభ్యర్థుల ఎంపిక ఖరారైందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా తెలిపారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి 1 చొప్పున మొత్తం 26 సీట్లు కేటాయించామని ఆయన చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి పొత్తుల్లో భాగంగా సీపీఐకి 3 సీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్యం కల్గిన ఐదు స్థానాలైనా తమకు కేటాయించాలని కోరినప్పటికీ కాంగ్రెస్‌ విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఎస్ అధినేత కోదండరామ్‌తోనూ దీనిపై మాట్లాడినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ కేటాయించిన ఆ 3 స్థానాలివే!
సీపీఐ పార్టీకి హుస్నాబాద్‌, బెల్లంపల్లి, వైరా స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే.. తమకు బలమున్న కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం జరిగే పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. కూటమి గురించి మొట్టమొదట ప్రతిపాదన చేసిన పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:

74 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా.. కూటమి సీట్లివే

Mobile AppDownload and get updated newsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares