హర్మన్‌ప్రీత్ శతకం.. కివీస్ టార్గెట్ 195

వెస్టిండీస్ వేదికగా ఈరోజు ఆరంభమైన మహిళల టీ20 ప్రపంచకప్‌ని భారత్ బ్యాట్స్‌వుమెన్ ఘనంగా ఆరంభించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (103: 51 బంతుల్లో 7×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

ఓపెనర్లు తనియా (9), స్మృతి మంథాన (2)‌తో పాటు హేమలత (15) తక్కువ స్కోరుకే ఔటవడంతో 5.4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు 40/3తో కష్టాల్లో పడింది. కానీ.. ఈ దశలో జెమిమా రోడ్రిగ్స్‌ (59: 45 బంతుల్లో 7×4)తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. పేసర్లు, స్పిన్నర్లు అని తేడాలేకుండా.. క్రీజు వెలుపలకి వచ్చి మరీ భారీ సిక్సర్లు కొట్టింది.

ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు పూర్తిచేసుకోగా.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 174 వద్ద రోడ్రిగ్స్‌ ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో శతకం సాధించిన హర్మన్‌ప్రీత్.. ఆఖరి ఓవర్‌లో ఔటైంది.

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares