360 డిగ్రీ బౌలింగ్: బాబూ ఇదేం బౌలింగ్.. అంపైర్ షాక్!

ధోనీ హెలికాప్టర్ షాట్ గురించి మనకు తెలుసు.. అలాగే, ఏబీ డివిలియర్స్ 360 డిగ్రీ బ్యాటింగ్ గురించి తెలుసు. కానీ, ఇదేంటీ కొత్తగా? 360 డిగ్రీ బౌలింగ్ ఏమిటీ అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే. టీమిండియా పోస్ట్ చేసిన ఈ వీడియోను రెండు వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు.

సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ జట్ల మధ్య ఇటీవల ఓ మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ శివసింగ్‌ తన చుట్టూ తాను 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ బంతి విసిరాడు. దీంతో అంపైర్‌ ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆ టీమ్ ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంపైర్‌తో వాదనకు దిగారు. అలా బౌలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అంపైర్ చెప్పారు.

ఈ వీడియోను భారత క్రికెట్ టీమ్ తమ ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘‘ఏమిటది? మనం స్విచ్ హిట్ గురించి విన్నాం. కానీ, స్విచ్ బౌలింగ్ యాక్షన్ ఎప్పుడూ చూడలేదు. క్రికెట్ చరిత్రలో ఈ తరహా బౌలింగ్ ఇదే తొలిసారి కావచ్చు. తప్పకుండా చూడండి’’ అంటూ ఈ వీడియో పోస్ట్ చేశారు. మీరు కూడా ఆ బౌలింగ్‌‌పై ఓ లుక్కేయండి మరి!

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FIndianCricketTeam%2Fposts%2F2102940373060978&width=500″ width=”500″ height=”529″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true” allow=”encrypted-media”></iframe>

Mobile AppDownload and get updated news

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares