Political News

సంపద పెంచుతున్నాం.. పేదలకు పంచుతున్నాం: కేసీఆర్

పదేళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నాలుగేళ్ల టీఆర్‌ఎస్ సర్కారు పాలనలో ఆదాయం చాలా ఎక్కువ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. సంపద పెంచుతున్నాం, పేదలకు పంచుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఆదాయం పది కోట్ల కంటే తక్కువేనని, నాలుగేళ్ల తమ పాలనలో రూ. 2550 కోట్ల ఆదాయం సృష్టించామని వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం (నవంబర్ 19) సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఏ […]

Read More

తగ్గిన బంగారం, వెండి ధరలు

శనివారం ట్రేడింగ్‌లో పెరిగిన బంగారం ధర సోమవారం మళ్లీ పతనమైంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్‌లో నేడు (నవంబర్ 19న) 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయల మేర తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,150 నుంచి 32,100కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,950గా నమోదైంది. […]

Read More

‘24 కిస్సెస్’.. కత్తి మహేష్ హాట్ కామెంట్

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. ‘అలా ఎలా’ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసినా ‘కుమారి 21ఎఫ్’లో చేసిన హాట్ రోల్‌తో హెబ్బాకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా కుర్రకారును హెబ్బా విపరీతంగా ఆకట్టుకుంది. ‘కుమారి 21ఎఫ్’ తరవాత హెబ్బాకు అవకాశాలు పెరిగినా చెప్పుకోదగిన హిట్టు మాత్రం దక్కలేదు. దీనికి తోడు ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గాయి. ఇలాంటి తరుణంలో ‘24 కిస్సెస్’ అనే సినిమాలో హెబ్బా నటించింది. ఇప్పుడు […]

Read More

కూటమిగా బీజేపీపై సమరం: బాబు, మమత

బీజేపీపై యుద్ధం ప్రకటించారు టీడీడీ అధినేత చంద్రబాబు. కమలదళానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలన్నిటిని కలిపి కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీల నేతల్ని కలిసిన బాబు.. సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కూటమి ఏర్పాటుతో పాటూ తాజా రాజకీయాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై మమతతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం […]

Read More

పాకిస్థాన్ ఫ్యాన్స్‌ ‘తెలివి’ నవ్వులపాలు..!

పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)‌ని ప్రశ్నించిన తీరు వైరల్‌గా మారింది. వెస్టిండీస్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండగా.. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన పాకిస్థాన్ జట్టు కనీసం సెమీస్‌లోకి కూడా అడుగుపెట్టలేకపోయింది. కానీ.. పాకిస్థాన్ అభిమానులు ఐసీసీని వేసిన ప్రశ్నలు ఇప్పుడు నవ్వులు పూయిస్తున్నాయి. Who do you think will contest the @WorldT20 Final? �� #WT20 — ICC (@ICC) 1542585419000 ‘మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో […]

Read More

వీడియో: రేవంత్ నామినేషన్ బాబోయ్ ఏంటా జనం!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నామినేషన్ పర్వం అట్టహాసంగా సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు కనీవిని ఎరుగని రీతిలో తరలివచ్చారు. దీంతో రహదారులన్నీ కిక్కిరిపోయాయి. నామినేషన్ పర్వాన్ని చూసిన చాలా మంది ఇక రేవంత్ గెలుపు సునాయాసమే అని చర్చించుకుంటున్నారు. గతంలో సీఎం అభ్యర్థులకు కూడా ఈ స్థాయిలో జనం తరలి రాలేదని చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సోమవారం (నవంబర్ 19) నామినేషన్ […]

Read More

‘చిత్రల‌హ‌రి’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా […]

Read More

తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజాకూటమిలో కీలకపాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్. ఎన్నికల నామినేషన్ల పర్వం నేడు ముగిసింది. అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం చేసిన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలతో రోడ్‌ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నలభై మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల […]

Read More

తెలంగాణ ఎన్నికలపై పవన్ కీలక ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై సందిగ్థత తొలగిపోయింది. నామినేషన్ల గడువు ముగిసిపోవడంతో.. పోటీకి దూరంగా ఉన్నట్లేనని తేలిపోయింది. అయితే ఈ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో కారణాలను వివరిస్తూ.. పార్టీ అధినేత పవన్ పేరుతో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ‘తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితి ఎన్నికలు జరిగినట్లయితే.. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై ఓ ప్రణాళికను రూపొందించుకున్నాము. కాని ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేకు ఈ ఎన్నికల […]

Read More

ఉత్కంఠ టెస్టులో పాకిస్థాన్‌పై కివీస్ గెలుపు..!

అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో ఈరోజు ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయాన్ని అందుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ అనూహ్యంగా 58.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో.. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగియగా.. రెండో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి జరగనుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి […]

Read More